ఫెన్నా నది ప్రవాహం లా .... గల గలా ... తళ తళ

Friday, August 20, 2010

శ్రావణమాసములో వరలక్ష్మీవ్రతము...




తెలుగునాట ప్రతి ఇంట వరలక్ష్మీ వ్రతము చేస్తారు. శౌనకాది మహర్షులకు సూతమహాముని చెప్పినదే. స్త్రీలకు సౌభాగ్యవంతమైనదీ, అపూర్వ ధనరాశులనూ ఇచ్చేదే వరలక్ష్మీ వ్రతము.
వరలక్ష్మీదేవి చారుమతికి కలలో కనిపించి, శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం పూజించి తరించమని చెబుతుంది.
చారుమతి సకల విధి విధానాలతో వరలక్ష్మీ వ్రతం పూర్తి చేసి, తొలి ప్రదక్షిణ చెయ్యగానే కాలి అందియలు ఘల్లుమని మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చెయ్యగానే నవరత్నఖచిత కంకణాలు ధగధగలాడాయి. మూడో ప్రదక్షిణ చెయ్యగానే ముత్తైయిదువులంతా సర్వాభరణ భూషితులయ్యారు. ఆ పట్టణమే ధన కనకములతో నిండిపోయింది. ఈ వ్రతం చేసినా,చూసినా సకల శుభములు సిద్ధిస్తాయని శౌనకాది మహర్షులకు చెప్పాడు.
ఈ మాసంలోనే రక్షబంధ నోత్సవము. ఇదే అన్నా చెల్లెళ్ళ పండుగ. అలాగే ఈ మాసంలోనే శ్రీకృష్ణాష్టమి.
శ్రావణమేఘాలు పరవశంతో పరుగులు తీస్తున్న ఈ సమయంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడు. రైతులు ఆవులనూ, ఎద్దులనూ పూజించే పోలాల అమావాస్య కూడా ఈ మాసంలోనే.

Friday, July 23, 2010

శంఖు పువ్వు...




ఇది మా కుండిలో పూసిన మొదటి శంఖు పువ్వు. ఇది విఘ్నేశ్వరునికి మరియు ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన పువ్వు.

Thursday, July 22, 2010

భగవంతుని పూజకు శ్రేష్టమైన పువ్వులు


పరమేశ్వరుని పూజలకు జిల్లేడూ, గన్నేరూ, మారేడూ, తమ్మి, ఉత్తరెణు ఆకులూ, జమ్మి ఆకులూ, జమ్మి పువ్వులూ, నల్లకలువలు మంచివి.
తొడిమ లేని పువ్వులు పూజకి పనికిరావు. తమ్మి పువ్వుకి పట్టింపులేదు.
మారేడు నందు శ్రీమహాలక్ష్మి, నల్లకలువ నందు పార్వతీ, తెల్ల కలువనందు కుమార స్వామి, కమలము నందు పరమేశ్వరుడూ కొలువై ఉంటారు. అలాగే చదువుల తల్లి సరస్వతి దేవి తెల్ల జిల్లెడులో, బ్రహ్మ కొండవాగులో, కరవీరపుష్పంలో గణపతీ, శివమల్లిలో శ్రీమహావిష్ణువూ, సుగంధ పుష్పాలలో గౌరీ దేవి ఉంటారు.
అలాగే శ్రీమహావిష్ణువుని అక్షింతల తోనూ, మహాగణపతిని తులసితోనూ, తమాల వృక్ష పువ్వులతో సరస్వతీ దేవినీ, మల్లెపూలతో భైరవుడ్నీ, తమ్మి పూలతో మహాలక్ష్మినీ, మొగలి పువ్వులతో శివుడ్నీ, మారేడు దళాలతో సూర్యభగవానుడ్ని ఎట్టి స్ధితిలోనూ పూజింపరాదు.

Wednesday, July 21, 2010

వెల్లుల్లి రక్తాన్ని గడ్డ కట్టించకుండా కాపాడుతుందా?


శక్తివంతమైనది, రక్షితమైనది వెల్లుల్లి. ఇది రక్తాన్ని పలుచగా చేసి ధమనుల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. వీలయినంత ఎక్కువగా వెల్లుల్లి, నీరుల్లిపాయలను తీసుకొవడం గుండె కెంతో మంచిది.

Tuesday, July 20, 2010

తొలి ఏకాదశి...


శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాఙ్గం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ద్యాన గమ్యం
వందే విష్ణుం భవభయ హరం సర్వలోకైక నాధం.

వెరైటీ బస్ స్టాపులు!!!

USA


Switzerland



Italy



South Africa



Finally India!!!

Monday, July 19, 2010

గుడిలో ప్రదక్షిణల పద్ధతి?

ధ్వజస్ధంభం నుంచి మళ్ళీ ధ్వజస్ధంభం వరకూ చేస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. అలాగే మందిరమయితే ముఖద్వారం వద్ద నుంచి ప్రారంభించి మళ్ళీ మందిర ముఖ ద్వారం వద్దకు వస్తే ఓ ప్రదక్షిణ పూర్తి అయినట్టు. హనుమంతునికి అయిదు ప్రదక్షిణాలు ప్రీతి. ఏదైనా కోర్కె ఉంటే 11,27,54,108 సంఖ్యలతో ప్రదక్షిణం చేస్తే ఫలితముంటుంది.
నవగ్రహాలకి మూడుసార్లూ, లేదా తొమ్మిదిసార్లూ, చేయ్యచ్చు. అలాగే పదకొండూ, ఇరవై ఒకటీ, ఇరవై ఏడూ ఇలా బేసి సంఖ్యలో చేయవచ్చు.