ఫెన్నా నది ప్రవాహం లా .... గల గలా ... తళ తళ

Friday, November 30, 2012

కార్తీక మాసంలో మనం చేసే పూజలు


   

       ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును దామోదర నామంతో పూజిస్తారు. ఎవరికి వీలున్న పరిస్థితిని బట్టి నదీ, నూతిస్నానమును భక్తితో చేస్తారు. ఈ మాసమును మించిన సమమైన మాసం లేదని అంటారు. కార్తీక  మాసంలో కార్తీక మహత్యమును చదువుతూ, మహాశివుడ్ని కొలుస్తూ ఉసిరి చెట్టు క్రింద పూజలు, భోజనాలూ, వనాల్లో విహరములూ ఇలా అనేక ఆరాధనలు చేస్తూ పరమానందంగా గడుపుతారు.
       కార్తీక సోమవారాలు విధిగా చేస్తారు. కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఈ మాసం మంగళ ప్రదము. స్త్రీలకు  ఐదవతనమును వృద్ది చేస్తుంది.
       ఆలయాల్లో, తులసీ వనాల్లో మహిళలు విశేషంగా అరటి దోప్పల్లో నూనె పోసి దీపాలని వెలిగిస్తారు. ఉసిరికాయపై వత్తిని పెట్టి వెలిగించి విష్ణు దీవెనలను పొందుతారు. ఈ మాసంలో శివునికి అభిషేకాలు చేస్తారు. శివాభిషేకం సకల పాపాలను పోగొడుతుంది.

Friday, November 16, 2012

ధనత్రయోదశి రోజు బంగారం కొంటే లక్ష్మికి ఆహ్వానమా?

                                                   

       
           'ధన్ తేరస్' అనే పేరుతో ఉత్తరాదిన బాగా ప్రాచుర్యం పొందిన ఈ పండుగ రోజు బంగారాన్ని కొనటం శుభమని, ఈ రోజుకొంటే ఏడాది పొడుగునా బంగారం కొనే ఆర్ధిక స్థితి శ్రీ మహాలక్ష్మి ఇస్తుందని నమ్మకం. పురాణ ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ పండుగ నాడు మహిళలు బంగారం కొనటానికి ఉత్సాహం చూపిస్తుంటారు.
           అష్టైశ్వర్యాల పండుగ అక్షయతృతీయ. ఈ రోజే శ్రీ మహాలక్ష్మి పాలకడలి నుంచి ఉద్భవించింది. పాండవులు అక్షయపాత్రను పొందిన రోజు. శ్రీ కృష్ణుడు కుచేలునికి బంగారు పట్టణాన్ని ఇచ్చిన రోజు.
           ఏది ఏమయినా ఈ రోజున ఎవరికున్నంతలో వారు బంగారం కొనుక్కుంటారు. 

Tuesday, November 13, 2012

కార్తీక స్నానమెందుకు?



             ఈ మాసంలో సూర్యోదయానికి ముందు  స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. మెడ వరకు నీటిలో వుండి స్నానం చెయ్యటం ద్వారా ఉదర వ్యాధులు నయమవుతాయి.
             కార్తీక స్నాన విషయంలో వొక ఆరోగ్య సూత్రం కూడా ఉంది. వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది.
             వర్షాకాలం తర్వాత వచ్చే కార్తీకమాసంలో ప్రవహించే నదుల్లో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది. దాని వల్లే కార్తీక మాసంలో నదీస్నానము, సముద్రాస్నానము చేయమంటారు. హరిహరాదులకు ప్రీతికరమైన మాసం కార్తీకమాసము.
             ఈ మాసంలో నదీసముద్ర స్నానము, దీపారాధన  ఎంతో పవిత్రము. పురుగులూ, మిడతలూ, చెట్లూ, పక్షులూ ఇలా అనేక జీవులు కార్తీక దీపాన్ని చూసి తమ జన్మరాహిత్యాన్ని పొందుతాయి.