ఫెన్నా నది ప్రవాహం లా .... గల గలా ... తళ తళ

Friday, July 23, 2010

శంఖు పువ్వు...




ఇది మా కుండిలో పూసిన మొదటి శంఖు పువ్వు. ఇది విఘ్నేశ్వరునికి మరియు ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన పువ్వు.

Thursday, July 22, 2010

భగవంతుని పూజకు శ్రేష్టమైన పువ్వులు


పరమేశ్వరుని పూజలకు జిల్లేడూ, గన్నేరూ, మారేడూ, తమ్మి, ఉత్తరెణు ఆకులూ, జమ్మి ఆకులూ, జమ్మి పువ్వులూ, నల్లకలువలు మంచివి.
తొడిమ లేని పువ్వులు పూజకి పనికిరావు. తమ్మి పువ్వుకి పట్టింపులేదు.
మారేడు నందు శ్రీమహాలక్ష్మి, నల్లకలువ నందు పార్వతీ, తెల్ల కలువనందు కుమార స్వామి, కమలము నందు పరమేశ్వరుడూ కొలువై ఉంటారు. అలాగే చదువుల తల్లి సరస్వతి దేవి తెల్ల జిల్లెడులో, బ్రహ్మ కొండవాగులో, కరవీరపుష్పంలో గణపతీ, శివమల్లిలో శ్రీమహావిష్ణువూ, సుగంధ పుష్పాలలో గౌరీ దేవి ఉంటారు.
అలాగే శ్రీమహావిష్ణువుని అక్షింతల తోనూ, మహాగణపతిని తులసితోనూ, తమాల వృక్ష పువ్వులతో సరస్వతీ దేవినీ, మల్లెపూలతో భైరవుడ్నీ, తమ్మి పూలతో మహాలక్ష్మినీ, మొగలి పువ్వులతో శివుడ్నీ, మారేడు దళాలతో సూర్యభగవానుడ్ని ఎట్టి స్ధితిలోనూ పూజింపరాదు.

Wednesday, July 21, 2010

వెల్లుల్లి రక్తాన్ని గడ్డ కట్టించకుండా కాపాడుతుందా?


శక్తివంతమైనది, రక్షితమైనది వెల్లుల్లి. ఇది రక్తాన్ని పలుచగా చేసి ధమనుల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. వీలయినంత ఎక్కువగా వెల్లుల్లి, నీరుల్లిపాయలను తీసుకొవడం గుండె కెంతో మంచిది.

Tuesday, July 20, 2010

తొలి ఏకాదశి...


శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాఙ్గం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ద్యాన గమ్యం
వందే విష్ణుం భవభయ హరం సర్వలోకైక నాధం.

వెరైటీ బస్ స్టాపులు!!!

USA


Switzerland



Italy



South Africa



Finally India!!!

Monday, July 19, 2010

గుడిలో ప్రదక్షిణల పద్ధతి?

ధ్వజస్ధంభం నుంచి మళ్ళీ ధ్వజస్ధంభం వరకూ చేస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. అలాగే మందిరమయితే ముఖద్వారం వద్ద నుంచి ప్రారంభించి మళ్ళీ మందిర ముఖ ద్వారం వద్దకు వస్తే ఓ ప్రదక్షిణ పూర్తి అయినట్టు. హనుమంతునికి అయిదు ప్రదక్షిణాలు ప్రీతి. ఏదైనా కోర్కె ఉంటే 11,27,54,108 సంఖ్యలతో ప్రదక్షిణం చేస్తే ఫలితముంటుంది.
నవగ్రహాలకి మూడుసార్లూ, లేదా తొమ్మిదిసార్లూ, చేయ్యచ్చు. అలాగే పదకొండూ, ఇరవై ఒకటీ, ఇరవై ఏడూ ఇలా బేసి సంఖ్యలో చేయవచ్చు.

Sunday, July 18, 2010

గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు?


' ప్రదక్షిణం ' లో ' ప్ర ' అనే అక్షరము పాపాలకి నాశనము...' ద ' అనగా కోరికలు తీర్చమని, ' క్షి ' అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని. ' ణ ' అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్ధం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కావున భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్ధం.

దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు?


సర్వదేవతలను పూజించే సమయాల్లోను, యఙ్ఞ, హోమాదుల్లోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పని సరి. కొబ్బరి కాయపైనున్న పెంకు మన అహంకారనికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరి కాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామనీ, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనస్సుని సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా తమ జీవితాలని ఉంచమని అర్ధం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరి కాయే.
కొబ్బరి కాయ అంటె మానవ శరీరం. బొండం పైనున్న చర్మం, మన చర్మం..... పీచు మనలోని మాంసము, పెంకే ఎముక, కొబ్బరే ధాతువు, అందులోని కొబ్బరినీరు మన ప్రాణధారం... కాయపైనున్న మూడు కళ్ళూ ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులు.

Saturday, July 17, 2010

తీర్దం సేవించిన తరువాత చేతిని తలకు రాసుకొవచ్చా?

తీర్దం తీసుకోవటానికి చేతిని గోకర్ణభంగిమలో ఉంచి తీసుకుంటాము. ఆ పై అనాలోచితంగా మనం ఆ చేతిని తలపై రాసుకుంటాము. అలా చెయ్యటం తగదు.
తీర్దం పంచామృతంతో చేస్తారు. అందులొ తేనె, పంచదార వంటివి జుట్టుకి మంచివికాదు. అలాగే తులసీ తీర్దం తీసుకున్నా తలపై రాసుకోకూడదు.
తీర్దం తీసుకోవడం వల్ల చేయి ఎంగిలవుతుంది. ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు.
ఏ తీర్దం తీసుకున్నా చేతిని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. వైష్ణవ సంప్రదాయంలో గంగా జలంతో అభిషేకం చేసిన తీర్దాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలని ఉంది.

Friday, July 16, 2010

పుష్పం పత్రం క్రియేటివిటి










ఆషాడమాసములో పండుగలూ,వ్రతాలూ?

జగన్నాధక్షేత్రంలో రధ యాత్ర జరుగుతుంది. ఈ మాసంలోనే శనైకాదశి. లేదా తొలి ఏకాదశి. శ్రీమహావిష్ణువు శంఖగదా చక్రాలు ధరించి ఆదిశేషునిపై శయినించి ఉండగా శ్రీమహాలక్ష్మిదేవి పాదములు వత్తుతుండే ప్రతిమను పూజించాలి. ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతాన్ని పడతారు. వ్యాస పూర్ణిమా, శివ శయనోత్సవము ఈ మాసంలొనే వస్తాయి.

దేవుని తీర్ధం ఎంత ఆరోగ్యము?

భగవంతుడ్ని దర్శించి తీసుకునే తీర్ధంలో ఎన్నో ఆరోగ్య సుగుణాలుంటాయి. శ్రీ గంధం, తులసీ, కర్పూరము,కేసరి మొదలగు వాటిని భగవంతుని తీర్ధంలో కలుపుతారు. ఈ తీర్ధం క్రిమిసం హారకంతో పాటు, రోగనివారక గుణం కలిగి వుంటుంది. అందుకే భగవంతుడ్ని దర్శించాక తీర్దం తీసుకుంటే ఆధ్యాత్మిక భావనతోపాటు ఆరోగ్యం కుడా కలుగుతుంది.