ఫెన్నా నది ప్రవాహం లా .... గల గలా ... తళ తళ

Friday, August 20, 2010

శ్రావణమాసములో వరలక్ష్మీవ్రతము...




తెలుగునాట ప్రతి ఇంట వరలక్ష్మీ వ్రతము చేస్తారు. శౌనకాది మహర్షులకు సూతమహాముని చెప్పినదే. స్త్రీలకు సౌభాగ్యవంతమైనదీ, అపూర్వ ధనరాశులనూ ఇచ్చేదే వరలక్ష్మీ వ్రతము.
వరలక్ష్మీదేవి చారుమతికి కలలో కనిపించి, శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం పూజించి తరించమని చెబుతుంది.
చారుమతి సకల విధి విధానాలతో వరలక్ష్మీ వ్రతం పూర్తి చేసి, తొలి ప్రదక్షిణ చెయ్యగానే కాలి అందియలు ఘల్లుమని మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చెయ్యగానే నవరత్నఖచిత కంకణాలు ధగధగలాడాయి. మూడో ప్రదక్షిణ చెయ్యగానే ముత్తైయిదువులంతా సర్వాభరణ భూషితులయ్యారు. ఆ పట్టణమే ధన కనకములతో నిండిపోయింది. ఈ వ్రతం చేసినా,చూసినా సకల శుభములు సిద్ధిస్తాయని శౌనకాది మహర్షులకు చెప్పాడు.
ఈ మాసంలోనే రక్షబంధ నోత్సవము. ఇదే అన్నా చెల్లెళ్ళ పండుగ. అలాగే ఈ మాసంలోనే శ్రీకృష్ణాష్టమి.
శ్రావణమేఘాలు పరవశంతో పరుగులు తీస్తున్న ఈ సమయంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడు. రైతులు ఆవులనూ, ఎద్దులనూ పూజించే పోలాల అమావాస్య కూడా ఈ మాసంలోనే.

No comments:

Post a Comment