ఫెన్నా నది ప్రవాహం లా .... గల గలా ... తళ తళ

Monday, May 10, 2010

చిటికెలో జవాబు

నీ స్నేహితుడి చేత పెద్ద లెక్క చేయించి, నువ్వు మాత్రం సులువుగా జవాబు చెప్పేసే చిట్కా ఒకటుంది. ముందుగా నీ మిత్రుని 7 కంటే పెద్దదైన సంఖ్యను తల్చుకోమను.దాని నుంచి విడివిడిగా 2,5,7 తీసేయమను. అలా వచ్చే మూడు సంఖ్యల్లో పెద్దదాన్ని,మిగతా రెండు సంఖ్యలూ పెట్టి విడివిడిగా గుణించమను. ఇప్పుడొచ్చే రెండు జవాబుల భేదము చెప్పమను. అది వింటూనే అతడు తల్చుకున్న సంఖ్యేమిటో చెప్పి ఆశ్చర్యపరచవచ్చు.

కిటుకు : నీ స్నేహితుడు చెప్పిన జవాబును మీరు మనస్సులో సగం చేసి, వచ్చిన దానికి రెండు కలిపితే సరి!

వివరణ : ఉదాహరణకు మీ స్నేహితుడు 16 తల్చుకున్నడనుకుందాం. మీ సూచనల ప్రకారం అతడు దాని నుంచి వరసగా 2,5,7 తేసేస్తే 14,11,9 వస్తాయి కదా. వీటిలో పెద్దదైన 14ని మిగతా రెండింటినితోను విడివిడిగా గుణిస్తాడు. అంటే 14X 11=154, 14X9=126 వస్తాయి. ఇప్పుడు 154 లోంచి 126 తీసేసి నీకు 28 అని పైకి చెబుతాడు. వెంటనే నువ్వు మనసులో దాన్ని సగం చేస్తే 14 వస్తుంది. దాని రెండు కలిపితే వచ్చే 16 అతడు తల్చుకున్నదేగా!

No comments:

Post a Comment