ఫెన్నా నది ప్రవాహం లా .... గల గలా ... తళ తళ

Friday, May 7, 2010

వజ్రం కంటే కఠినమైన పదార్ధం


ప్రపంచంలో ఇప్పటివరకు వజ్రమే కఠినమైన పదార్ధమని భావిస్తూ వచ్చారు. కాని లాన్స్ డలైట్ (Lonsdaleite), వుర్ట్ జైట్ బోరాన్ నైట్రైడ్ (Wurtzite boron nitride) అనేవి వజ్రం కంటే కఠినమైన పదార్దాలని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. వజ్రం కంటే లాన్స్ డలైట్ 58 రెట్లు ఎక్కువ గట్టిగా ఉంటుంది. ఇది తోకచుక్కలు భూమిని ఢీకొట్టినప్పుడు ఎర్పడుతుంది. వుర్ట్ జైట్ బోరాన్ నైట్రైడ్ అనేది వజ్రం కంటే 18 రెట్లు ఎక్కువ గట్టిదనంతో ఉంటుంది. ఇది అగ్నిపర్వతాలు బద్దలైనప్పుదు అధిక ఉష్నొగ్రత, పీడనాల వద్ద ఎర్పడుతుంది. ఈ రెండింటిలో వుర్ట్ జైట్ బోరాన్ నైట్రైడ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది.ఆక్సిజెన్ సమక్షంలో ఇది అధిక ఉష్ణొగ్రత వద్ద కూడా వజ్రం కంటే స్థిరంగా ఉంటుంది. అధిక ఉష్ణొగ్రతల వద్ద పరికరాలను తయరుచేసేటప్పుడు వాటిని కోయడానికి లేదా రంధ్రాలు చేయడానికి, అంతరిక్ష వాహనాల పైభాగాల్లో వాడే ఫలకాల తయారీలో కూడా ఈ పదార్ధాన్ని వాడవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

No comments:

Post a Comment